తొలి శుభోదయం కందుకూరు:-

కందుకూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 2026 నూతన సంవత్సర వేడుకలు గురువారం అట్టహాసంగా జరిగాయి. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసేందుకు వివిధ వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇంకా బిజెపి జనసేన నేతలు ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపేందుకు పోటీపడ్డారు.ముందుగా పట్టణ టిడిపి నాయకులు ఏర్పాటుచేసిన 40 కిలోల భారీ కేకును ఎమ్మెల్యే నాగేశ్వరరావు కట్ చేసి, నియోజకవర్గ ప్రజల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పట్టణ పార్టీ నేతలు యాపిల్ దండతో, సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో గజమాలతో ఎమ్మెల్యేను సత్కరించారు.కందుకూరు పట్టణం తో పాటు కందుకూరు, వలేటివారిపాలెం, లింగసముద్రం, ఉలవపాడు, గుడ్లూరు మండలాల నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలిరావడంతో టిడిపి కార్యాలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు చెప్పేందుకు కార్యకర్తలు క్యూ కట్టారు. ఇంకా పలు శాఖల అధికారులు, పలు రాజకీయపార్టీల నేతలు తరలివచ్చి వేడుకల్లో పాలుపంచుకున్నారు. ముఖ్యంగా మహిళలు, యువకులు అధికంగా కనిపించారు. మరోవైపు ఏడాది వేడుకలను వినూత్నంగా జరగాలని ఆశించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, తన వద్దకు వచ్చేవారు శాలువాలు, పూలదండలు, బొకేలు తీసుకురావద్దని ముందుగానే సూచించారు. పేద పిల్లల చదువులకు అవసరమైన వస్తు సామాగ్రి తీసుకురావాలని, కందుకూరు లోని ప్రభుత్వ ఏరియా వైద్యశాల అభివృద్ధికి మంచి మనసుతో విరాళాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో నాయకులు, కార్యకర్తలు… నోటు పుస్తకాలు, పెన్నులు, ప్యాడ్లు తీసుకొచ్చి ఎమ్మెల్యే కి అందించారు. మరి కొంతమంది ఆసుపత్రి అభివృద్ధికి స్వచ్ఛందంగా నగదు రూపంలో విరాళాలు అందించారు. పట్టణ టిడిపి మాజీ అధ్యక్షుడు పిడికిటి వెంకటేశ్వర్లు 55,555 రూపాయలు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఉప్పుటూరి శ్రీనివాసరావు 50 వేలు, ఇంకా మరి కొంతమంది కలిపి సుమారు రెండు లక్షలకు పైగా విరాళాలను ఎమ్మెల్యే చేతికి అందించారు. ఎంతో వారందరినీ ఎమ్మెల్యే నాగేశ్వరావు మనస్పూర్తిగా అభినందించారు.వేడుకల సందర్భంగా నాయకులు, కార్యకర్తలు తీసుకువచ్చిన వివిధ రకాల పండ్లను, స్థానిక ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో సుమారు వందమందికి పైగా రోగులు, సిబ్బందికి పంపిణీ చేయడం జరిగిందిఈ కార్యక్రమంలో కందుకూరు మండల టిడిపి అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, వలేటివారిపాలెం మండల టిడిపి పార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మీనరసింహం, కందుకూరు మండల పార్టీ అధ్యక్షులు బుస్సారెడ్డి కృష్ణారెడ్డి, గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షులు జనిగర్ల నాగరాజు, లింగసముద్రం మండల పార్టీ అధ్యక్షులు పూరిమెట్ల గురునాథం, ఉలవపాడు మండల పార్టీ అధ్యక్షులు రాచగర్ల సుబ్బారావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చిలకపాటి మధుబాబు, ఆంధ్రప్రదేశ్ విద్యా మరియు సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ పోకూరి రాంబాబు, నెల్లూరు పార్లమెంట్ టిడిపి ఉపాధ్యక్షులు ఉన్నం వీరాస్వామి, పార్టీ నాయకులు పిడికిటి వెంకటేశ్వర్లు ఉప్పుటూరి శ్రీనివాసరావు, చదలవాడ కొండయ్య, బెజవాడ ప్రసాద్, నాదెళ్ల వెంకట రమణయ్య, షేక్ రఫీ, షేక్ రూబీ, కల్లూరి శైలజ మరియు క్లస్టర్ యూనిట్ ఇన్చార్జులు అనుబంధ సంఘాల అధ్యక్షులు కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు యువత భారీ సంఖ్యలో పాల్గొన్నారు..

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *