తొలి శుభోదయం ప్రకాశం:-

రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ప్రకాశం జిల్లా పోలీసులు ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలనే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాపాయం నుంచి రక్షణ పొందవచ్చని, చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదానికి దారితీస్తుందని తెలిపారు. ముఖ్యంగా యువత మరియు ద్విచక్ర వాహనదారులు రోడ్డు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, హెల్మెట్ ధరించడం అలవాటుగా మార్చుకోవాలని పోలీసులు పిలుపునిచ్చారు. ఈ అవగాహన కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *