తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజల ప్రాణాలను కాపాడాలనే లక్ష్యంతో, ప్రకాశం జిల్లా పోలీసులు రోడ్డు భద్రతా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలలో భాగంగా, కలెక్టరేట్ నుండి మినీ స్టేడియం వరకు నిర్వహించిన రోడ్డు భద్రతా వాక్‌థాన్‌లో ప్రకాశం జిల్లా పోలీసులు చురుకుగా పాల్గొన్నారు.ఈ వాక్‌థాన్ ద్వారా ప్రజల్లో ట్రాఫిక్ నిబంధనల పాటన, హెల్మెట్ ధరించడం, సీట్‌బెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనం నడపకూడదనే అంశాలపై అవగాహన కల్పించారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారి తీస్తుందని పోలీసులు ప్రజలకు వివరించారు.ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ, రోడ్డు భద్రతపై అవగాహన పెంచడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని, ప్రతి వాహనదారుడు నిబంధనలు పాటిస్తే ప్రాణనష్టం లేకుండా సురక్షిత ప్రయాణం సాధ్యమని తెలిపారు. ప్రజల సహకారంతోనే రోడ్డు ప్రమాదాలను పూర్తిగా నియంత్రించవచ్చని అన్నారు.ప్రకాశం జిల్లా పోలీసులు ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తున్నారని తెలిపారు.