తొలి శుభోదయం కందుకూరు:-
కందుకూరు సబ్ కోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసికూటర్ (ఏ పి పి) గా వలేటి శ్రీధర్ నాయుడు ను నియమిస్తు ప్రభుత్వంవారు ఉత్తర్వులు జారీచేసింది. వలేటివారిపాలెం గ్రామానికి చెందిన శ్రీధర్ నాయుడు పదవ తరగతి వరకు వలేటివారిపాలెం స్కూలులో చదవగా ఇంటర్, డిగ్రీ కుందుకూరు టీ ఆర్ ఆర్ గవర్న మెంట్ కళాశాలలో చదువుకున్నారు. లా డిగ్రీ నెల్లూరు వి. ఆర్ కాలేజిలో పూర్తి చేశారు. తనను ఏపీపీగా ఎంపికకు సహకరించిన కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు కి, రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ డోలా బాల శ్రీ వీరాంజనేయస్వామి కి, కందుకూరు, సింగరాయకొండ, ఒంగోలు న్యాయవాద మిత్రులకు, వలేటివారిపాలెం గ్రామస్తులకు ఈ సందర్భంగా శ్రీధర్ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. కందుకూరు బార్ అసోసియేషన్ న్యాయవాద మిత్రులు శ్రీధర్ నాయుడు కి శుభాకాంక్షలు తెలియజేశారు.