తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రజల ప్రశాంత జీవనం, శాంతి భద్రతల పరిరక్షణ, సామాజిక క్రమశిక్షణ లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు, జిల్లా వ్యాప్తంగా ఓపెన్ బూజింగ్ ప్రదేశాల శుభ్రత కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.ఈ కార్యక్రమంలో భాగంగా మద్దిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని వెల్లంపల్లి గ్రామంలో బహిరంగంగా మద్యం సేవించే ప్రదేశాలను గుర్తించి శుభ్రపరిచారు. అలాగే పొన్నలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ముత్తరాసిపాలెం గ్రామంలో కూడా ఓపెన్ డ్రింకింగ్ ప్రదేశాలపై ప్రత్యేక శుభ్రత చర్యలు చేపట్టారు.ఈ శుభ్రత కార్యక్రమాలను మద్దిపాడు పీఎస్ ఎస్‌ఐ పర్యవేక్షణలో, అలాగే పొన్నలూరు పీఎస్ ఎస్‌ఐ నేతృత్వంలో సమర్థవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు అవగాహన కల్పిస్తూ బహిరంగ మద్యం సేవ చట్టవిరుద్ధమని, ఇటువంటి చర్యలు సమాజానికి హానికరమని వివరించారు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.ప్రకాశం జిల్లా పోలీసులు ప్రజల భాగస్వామ్యంతో క్రమబద్ధమైన, సురక్షిత సమాజాన్ని నిర్మించేందుకు ఓపెన్ బూజింగ్ మరియు అసాంఘిక కార్యకలాపాల నివారణకు ఇలాంటి ప్రత్యేక డ్రైవ్‌లు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు. ప్రజలు కూడా తమ పరిసర ప్రాంతాల్లో ఇటువంటి ఘటనలు గమనిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 112 కు సమాచారం అందించాలని కోరారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *