తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు, పెద్ద చెర్లొపల్లి గ్రామంలో రోడ్ సేఫ్టీ వారియర్స్ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశాన్ని పి.సి. పల్లి పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ ఆధ్వర్యంలో నిర్వహించగా, గ్రామస్థులు, యువకులు, వాహనదారులకు రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కల్పించారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాల కారణాలు, వాటి వల్ల కలిగే నష్టాలను వివరించి, ప్రమాదాలను ఎలా నివారించవచ్చో స్పష్టంగా తెలియజేశారు.ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, హెల్మెట్ తప్పనిసరిగా ధరించడం, మద్యం సేవించి వాహనం నడపకూడదని, అతివేగాన్ని నియంత్రించుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణాపాయానికి దారితీస్తుందని హెచ్చరించారు.గ్రామస్థులు, యువత రోడ్ సేఫ్టీ వారియర్స్‌గా మారి తమ గ్రామాల్లో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడంలో సహకరించాలని కోరారు. ప్రజల భాగస్వామ్యంతోనే రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చని పోలీసులు తెలిపారు.ప్రకాశం జిల్లా పోలీసులు రోడ్డు భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, ఇలాంటి అవగాహన కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా నిరంతరం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *