తొలి శుభోదయం కందుకూరు:-
ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండలంలోని మోచర్ల గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన యువకుడు మంగళవారం విడుదలైన గ్రూప్ -2 ఫలితాలలో తొలి ప్రయత్నంలోనే ఉద్యోగం సాధించిన దారా ఆమోస్ పలువురు యువకులకు ఆదర్శంగా నిలిచాడు. ఇతను మాచర్ల గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన ధార అచ్చమ్మ, దారా మాల్యాద్రి దంపతులకు జన్మించినటువంటి యువకుడు. తల్లిదండ్రులు ఇద్దరు బేల్దారి మేస్త్రి పనులకు వెళ్తూ కన్న కొడుకుని కష్టపడి చదివించారు. అతను కూడా 2021 నుంచి మంచి లక్ష్యంతో గ్రూప్ -2 పరీక్షలలో ఉత్తీర్ణత సాధించడం కోసం అహర్నిశలు శ్రమించి ఉత్తమ ఫలితాలు సాధించి ఈ పరీక్షల్లో 200.1 మార్కులతో ఏ.ఎస్.ఓ (జిఏడి) ఉద్యోగం సాధించినట్లు తొలి ప్రయత్నం లోనే ఈ విజయం తనను వరించిందని సంతోషం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు కష్టం చేసుకుంటూ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని గ్రూప్-2 ఉద్యోగం ద్వారా సాధించగలగాని హర్షం వ్యక్తం చేశారు.