తొలి శుభోదయం ప్రకాశం:-

పోలీసు శాఖలో విశేష సేవలు అందించి ఉద్యోగ విరమణ పొందిన జిల్లా స్పెషల్ బ్రాంచ్ లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ తుమ్మల సింగయ్య HC.1906, 36 సర్వీస్ శనివారం ఎస్పీ గారు జిల్లా పోలీస్ కార్యాలయంలో శాలువా, పుష్పగుచ్ఛాలతో సత్కరించి ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు.జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా విధి నిర్వహణలో ఎన్నో ఒడిదుడుకులు, కఠిన పరిస్థితులు ఎదుర్కొంటూ పోలీసు ఉద్యోగ బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేయడం ఎంతో ఆనందదాయకమని అన్నారు. పోలీసు విధుల నిర్వహణలో కుటుంబానికి దూరంగా ఉంటూ విధులపట్ల అంకితభావంతో పనిచేశారన్నారు.జిల్లా పోలీస్ శాఖకు వారు అందించిన సేవలను శాఖ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని, గతంలో వారు క్యాష్ రివార్డ్స్–20, జీఎస్‌ఈ–50, సేవాపతకం–1 పొందివున్నారు. పోలీసు ఉద్యోగంలో సేవలందించేందుకు సహాయ సహకారాలు అందించిన కుటుంబ సభ్యులకు జిల్లా పోలీస్ శాఖ తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. వారి పట్ల ప్రేమ, ఆప్యాయతతో ఉండాలని సూచించారు. ఉద్యోగ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు. విరమణ అనంతరం ఏదైనా సమస్య ఉంటే నేరుగా తనను సంప్రదించవచ్చని, పోలీసు శాఖ ఎల్లవేళలా వారికి తోడుగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎఆర్ఎస్సై తిరుపతి స్వామి, సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *