తొలి శుభోదయం సింగరాయకొండ:-
మూలగుంటపాడు గ్రామ పంచాయతీ పరిధిలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల నగదు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ న్యాయ విభాగం అధ్యక్షులు సన్నెబోయిన శ్రీనివాసుల నాయుడు, సింగరాయకొండ మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి ముళ్ళపూడి సత్యనారాయణ, గుదె వెంకటేశ్వర్లు, అంబటి శ్రీనివాసరావు, సనబొయన వెంకటేశ్వర్లు, వెంకట్రావు, సుధ, మూలగుంటపాడు గ్రామ టీడీపీ పార్టీ జనరల్ సెక్రటరీ ఎల్.వి. రవి వర్మ, రిటైర్డ్ టీచర్ దాసరి రామారావు, గ్రామ పంచాయతీ కంప్యూటర్ అసిస్టెంట్ సుధాకర్, హనుమంతరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు.కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు ఐనా బత్తిన రాజేష్, టీడీపీ నాయకులు చిగురుపాటి శేషగిరిరావు, నరాల సుధాకర్, మోటుపల్లి కిషోర్ కూడా పాల్గొన్నారు.