తొలి శుభోదయం ప్రకాశం పోలీస్:-

ప్రకాశం జిల్లా పోలీస్ శాఖలో ఎఆర్ హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న హుస్సేన్ కుమార్తె రిజ్వానా APPSC గ్రూప్–1 ఫలితాలలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP)గా ఎంపిక కావడం గర్వకారణమని జిల్లా ఎస్పీ తెలిపారు. అదేవిధంగా APPSC గ్రూప్–2 ఫలితాలలో స్పెషల్ పార్టీ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు కానిస్టేబుళ్లు కె.అశోక్ రెడ్డి డిప్యూటీ తహసీల్దార్‌గా, కె.వెంకటేశ్వర్లు మరియు కె. సూర్య తేజలు ఎక్సైజ్ సబ్–ఇన్‌స్పెక్టర్లుగా ఎంపిక కావడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ప్రకాశం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో జిల్లా ఎస్పీ గారు వారికి పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపి బహుమతి లు అందజేశారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ఇదే పట్టుదల, క్రమశిక్షణ, కఠోర కృషితో భవిష్యత్తులో మరింత ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. దృఢ సంకల్పం, సరైన ప్రణాళిక, సమయ పాలనతో పాటు నిరంతర అధ్యయనం ద్వారా జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చన్నారు. APPSC గ్రూప్–1 మరియు గ్రూప్–2 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడంలో ముఖ్యపాత్ర పోషించిన తల్లిదండ్రులను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. పోలీస్ శాఖలో పనిచేస్తున్న సిబ్బంది తమ పిల్లలకు క్రమశిక్షణ, నైతిక విలువలు, సరైన మార్గదర్శనం అందిస్తూ చదువులో ప్రోత్సహించాలని సూచించారు. అలా చేస్తే వారు ఉన్నత స్థాయికి చేరుకోవడమే కాకుండా సమాజానికి ఆదర్శంగా నిలుస్తారని తెలిపారు.ఈ కార్యక్రమం లోఎస్బీ సీఐ శ్రీనివాసరావు, ఆర్ఐ లు రమణారెడ్డి, సీతారామరెడ్డి మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *