తొలి శుభోదయం సింగరాయకొండ:-

స్మార్ట్ జెన్ స్కూల్ యాజమాన్యం సింగరాయకొండ పోలీస్ వారి ఆధ్వర్యంలో రోడ్ భద్రత నియమాల గురించి అవగాహన కల్పించుట కొరకు ర్యాలీ నిర్వహించారు.స్థానిక ప్రజలు కూడా విద్యార్థుల నినాదాలను ఆసక్తిగా వీక్షించి రోడ్డు భద్రతపై అవగాహన పొందారు. ఈ కార్యక్రమం ద్వారా రోడ్డు భద్రత అనేది ఒక్క వ్యక్తి బాధ్యత మాత్రమే కాకుండా సమాజం మొత్తానికి చెందిన బాధ్యత అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు.ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ గారైన డాక్టర్ గీతా రాణి మాట్లాడుతూ, రోడ్డు భద్రత నియమాలను పాటించడం ప్రతి పౌరుడి బాధ్యత. చిన్నపిల్లల నుంచే ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పిస్తే ప్రమాదాలనుతగ్గించవచ్చని,రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడమే. చిన్న వయస్సు నుంచే విద్యార్థుల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందిస్తే,భవిష్యత్తులో ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని అన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుత పౌరులుగా ట్రాఫిక్ నియమాలు పాటించాల్సిన అవసరం ఉందని, ఒక్క క్షణం నిర్లక్ష్యం జీవితాంతం పశ్చాత్తాపం కలిగిస్తుందని, రోడ్డు భద్రత అనేది ఒక్క పోలీసుల బాధ్యత మాత్రమే కాదు. ఇది ప్రతి పౌరుడి బాధ్యత. హెల్మెట్ ధరించడం, సీట్‌బెల్ట్ పెట్టుకోవడం, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం మన జీవితాలను మనమే రక్షించుకున్నట్లే అని పేర్కొన్నారు.
ఈ ప్రోగ్రాం లో స్కూల్ జిఎం సార్ అయినటువంటి హరిప్రసాద్ ,ప్రిన్సిపల్ లలిత రావు, డీన్ ప్రేమ్ కుమార్ మరియు స్కూల్ ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు విద్యార్థులు ఈ ప్రోగ్రాం లో పాల్గొనడం జరిగింది

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *