తొలి శుభోదయం సింగరాయకొండ:-
సింగరాయకొండ మండలం శానంపూడి గ్రామం నందు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ మరియు నూతన స్వర్ణ గ్రామం కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డా.డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తో కలిసి పాల్గొన్న రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ *శ్రీ దామచర్ల సత్య ఈ సందర్భంగా సత్య మాట్లాడుతూ రెవెన్యూ వ్యవస్థ లో గత ప్రభుత్వం లో జరిగిన తప్పిదాలను సరిచేస్తూ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు రైతులందరికి నూతన పట్టాదారు పాసు పుస్తకాలను రాజముద్ర తో అందించడం జరుగుతుందని తెలియజేశారు.అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు దే అని తెలియజేశారు.సింగరాయకొండ మండలం లో అధికంగా ఉన్నటువంటి రెవెన్యూ సమస్యలను మంత్రి స్వామి సహకారంతో పరిష్కారానికి కృషి చేస్తాం అని వెల్లడించారు.