తొలి శుభోదయం ప్రకాశం పోలీస్:-

ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్షలు ప్రశాంతంగా, సజావుగా నిర్వహించబడేలా ప్రకాశం జిల్లా పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. ఈ క్రమంలో ఒంగోలు పట్టణంలోని పరీక్ష కేంద్రాలను సీఐ, ఒంగోలు I టౌన్ పోలీస్ స్టేషన్ అధికారి స్వయంగా సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.పరీక్ష కేంద్రాల వద్ద శాంతిభద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ, అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందికి స్పష్టమైన సూచనలు ఇచ్చారు. విద్యార్థులు మరియు తల్లిదండ్రులు నిశ్చింతగా పరీక్షలకు హాజరయ్యేలా తగిన భద్రతా చర్యలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.పరీక్ష నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన చోట అదనపు సిబ్బందిని మోహరించామని పోలీసులు వెల్లడించారు.ప్రజల సహకారంతోనే ప్రశాంత వాతావరణంలో పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయి అని అధికారులు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *