తొలి శుభోదయం కందుకూరు:-
లింగసముద్రం పంచాయితీ జంగంరెడ్డిపాలెంలో జరిగిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ ప్రథమ పుష్కర బ్రహ్మోత్సవాలలో పాల్గొనడం ఎంతో సంతోషాన్నిచ్చింది.ఈ పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయంలో స్వామివారిని దర్శించుకుని, నియోజకవర్గ ప్రజలందరిపై ఆ దేవుని కృపాకటాక్షాలు ఉండాలని ప్రత్యేక పూజలునిర్వహించాను.ముఖ్యంగా, ఈ ఉత్సవాల సందర్భంగా వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన మన గ్రామస్తులందరూ సొంతూరికి తరలిరావడం, వారందరినీ సోమవారం పేరుపేరునా ఆత్మీయంగా పలకరించడం నాకు ఎంతో సంతృప్తిని కలిగించింది. భక్తి భావంతో పాటు, మనవైన ఆప్యాయతలు వెల్లివిరిసిన ఈ వేడుకలో భాగస్వామినైనందుకు ధన్యుడిని.