తొలి శుభోదయం ప్రకాశం పోలీస్ :-

జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు,ప్రకాశం జిల్లా మరియు మార్కాపురం పోలీసులు జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా సరికొత్త MSCD (Mobile Software Components Device) సాంకేతికతను వినియోగించి అనుమానితుల వేలిముద్రలను అప్పటికప్పుడే సేకరించి విశ్లేషించారు.రద్దీగా ఉండే ప్రాంతాలు, బస్టాండ్‌లు మరియు రైల్వే స్టేషన్ల వద్ద తనిఖీలు నిర్వహిస్తూ, పాత నేరస్తుల రికార్డులతో ఈ వేలిముద్రలను సరిపోల్చారు. ఈ విధానం ద్వారా నేర చరిత్ర కలిగిన వ్యక్తులను త్వరగా గుర్తించడానికి వీలు పడుతుందని పోలీసులు తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వల్ల నేరాల నియంత్రణలో పారదర్శకత మరియు వేగం పెరుగుతుందని అధికారులు స్పష్టం చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *