తొలి శుభోదయం ఉలవపాడు:-

ఉలవపాడు మండలం వీరేపల్లి గ్రామానికి చెందిన గొల్లపూడి ఉదయ్ కుమార్ ఇటీవల గ్రూప్-1 కు సెలెక్ట్ అయ్యి, డిప్యూటీ రిజిస్ట్రార్ ఉద్యోగం సంపాదించాడు. ప్రస్తుతం సామర్లకోటలో అసిస్టెంట్ రైల్వే స్టేషన్ మాస్టర్ గా విధులు నిర్వహిస్తున్నాడు.ఈ నేపథ్యంలో కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మంగళవారం తన కార్యాలయానికి పిలిపించుకుని ఉదయ్ కుమార్ ను ప్రత్యేకంగా అభినందించారు. చిన్న కుటుంబంలో పుట్టి, కష్టపడి చదివి, భవిష్యత్తును తీర్చిదిద్దుకున్నారని ప్రశంసించారు. గతంలో కూడా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన విషయాన్ని గ్రామస్తులు ఎమ్మెల్యేకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగేశ్వరరావు గారు ఉదయ్ కుమార్ శాలువాతో ఘనంగా సత్కరించి, అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ టిడిపి నాయకుడు లక్కంరాజు నరేష్, మోడల్ స్కూల్ చైర్మన్ ప్రభాకర్, పార్టీ నాయకులు సత్యం, గురవయ్య, నరసింహ తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *