తొలి శుభోదయం ప్రకాశం పోలీస్:-
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా మరియు మార్కాపురం జిల్లా పోలీసులు శాంతిభద్రతల పరిరక్షణ మరియు నేరాల నియంత్రణలో భాగంగా ఉమ్మడిగా భారీ వాహన తనిఖీలు నిర్వహించారు. జిల్లా సరిహద్దులు, ప్రధాన కూడళ్లు మరియు జాతీయ రహదారులపై పోలీసులు కేంద్రీకృతమై తనిఖీలు చేపట్టారు.ఈ తనిఖీల్లో భాగంగా వాహనాల పత్రాలను పరిశీలించడంతో పాటు, అనుమానిత వ్యక్తులను మరియు వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. నంబర్ ప్లేట్లు సరిగా లేని వాహనదారులకు, హెల్మెట్ ధరించని వారికి మరియు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేశారు. అక్రమ రవాణా, గంజాయి మరియు ఇతర నిషేధిత వస్తువుల తరలింపుపై నిఘా ఉంచడమే ఈ తనిఖీల ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించి, ప్రయాణ సమయాల్లో సరైన పత్రాలను వెంట ఉంచుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.