తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-

ఈ నెల 14, 15 తేదీలలో నిర్వహించనున్న సింగరాయకొండ, పాకాల బీచ్ ఫెస్టివల్ సందర్భంగా ప్రజలకు ఆహ్లాదకరమైన అనుభూతితో పాటు పూర్తి భద్రత కల్పించడమే లక్ష్యంగా భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు ఒంగోలు డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు వెల్లడించారు. సింగరాయకొండ సర్కిల్ అధికారులతో నిర్వహించిన బ్రీఫింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. బీచ్ ఫెస్టివల్‌కు వచ్చే సందర్శకుల కోసం ప్రత్యేక ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, పార్కింగ్ వసతులు మరియు సముద్ర స్నానాల వద్ద ప్రమాదాలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పండుగ వాతావరణంలో జరిగే ఈ వేడుకల్లో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని పోలీసు శాఖ జారీ చేసిన నియమాలు, మార్గదర్శకాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని ఆయన కోరారు. ముఖ్యంగా సముద్ర తీరంలో లోతైన ప్రాంతాలకు వెళ్లవద్దని, పోలీసుల సూచనలు పాటించి వేడుకలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *