తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:-

దామోదర సంజీవయ్య 104వ జయంతి సందర్భంగా, టంగుటూరి అంబేద్కర్ నగర్లోని అంబేత్కర్ పార్కు నందు “అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది” ముందుగా దామోదర సంజీవయ్య చిత్రపటానికి అంబేద్కర్ నగర్ వాసులు, పెద్దలు, యూత్, పూలమాలవేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా రాష్ట్ర మాల ఉద్యోగ సంఘ అధ్యక్షులు మాట్లాడుతూ.. ఈ రాష్ట్రంలో మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి దామోదర సంజీవ గారు అని ఆయన నిస్వార్ధమైనటువంటి రాజకీయ సేవకుడని అని, శనివారం ఇస్తున్నటువంటి వృద్ధాప్య పింఛన్లు కూడా దామోదరయ్య సంజీవ గారి యొక్క ఆలోచనలేనని, బీసీలకు మండల కమిషన్ రిపోర్ట్ కన్నా ముందే 27% రిజర్వేషన్ అమలు చేసినటువంటి మహనీయుడని, కాపులకు రిజర్వేషన్ అమలు చేసినటువంటి మహోన్నతుడని, ప్రమోషన్లలో రిజర్వేషన్లు అమలు చేసినటువంటి నిజమైన అంబేత్కర్ వారసుడని, సమాజంలో ప్రతి ఒక్కరి కోసం పరిత పంచి, చివరకు తనకు మంచి ఇల్లు కూడా లేనటువంటి జీవితం గడిపినటువంటి ఆదర్శప్రాయుడని అశోక్ బాబు కొనియాడారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ నగర్ నాయకులు దుగ్గిరల పేరాజు.. మాట్లాడుతూ దామోదర సంజీవ జీవితం నేటి యువతకి ఆదర్శం అని తెలిపారు అందరూ చదువుకొని ఉద్యోగాల సంపాదించాలని తెలిపారు, ఈ కార్యక్రమంలో తుల్లిబిల్లి క్రాంతికుమార్, కస్కుర్తి రాజు, నత్తల ధన కోటేశ్వరరావు, దేవరపల్లి రాము,దుగ్గిరాల బుజ్జి ,దేవరపల్లి ప్రశాంత్ ,మద్దిరాల సాయి, నాని, బాబురావు, బుర్రి చంద్ర, టి .శ్రీకాంత్ మరియు యువకులు విద్యార్థులు కలిసి దామోదర్ సంజీవ గారికి ఘనంగా నివాళులర్పించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *