తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో ఫిబ్రవరి 14, 15 తేదీల్లో (శనివారం, ఆదివారం) ఖేల్లో ఇండియా అస్మిత స్టేట్ లెవెల్ రోల్ బాల్ లీగ్ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించబడింది.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మలినేని గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వ్యవస్థాపకులు మలినేని లక్ష్మయ్య , ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అసోసియేట్ డైరెక్టర్ కె. బసవిరెడ్డి , ప్రిన్సిపల్ దిల్నషీన్, మలినేని ఇంజనీరింగ్ కాలేజ్ డైరెక్టర్ ఏ.జి.కే. మూర్తి విచ్చేసి క్రీడాకారిణులను ఉత్సాహపరిచారు.రాష్ట్ర స్థాయి ఈ పోటీలలో రాష్ట్రంలోని 12 జిల్లాల నుండి సుమారు 120 మంది క్రీడాకారిణులు పాల్గొన్నారని రాష్ట్ర రోల్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు.క్రీడల ద్వారా యువతలో ఆత్మవిశ్వాసం, శారీరక దృఢత్వం మరియు క్రమశిక్షణ పెంపొందుతాయని, ఇలాంటి రాష్ట్ర స్థాయి పోటీలు ప్రతిభావంతులైన క్రీడాకారిణులకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తాయని అతిథులు పేర్కొన్నారు.ఈ రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీలు ఉత్కంఠభరితంగా కొనసాగనున్నాయి.