తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం :-

ప్రకాశం జిల్లా పెర్నమిట్ట గ్రామ అవుట్‌స్కర్ట్స్ (శివారు) ప్రాంతంలో అక్రమంగా జూదం నిర్వహిస్తున్నారన్న తాలూకా పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ నేతృత్వంలో పోలీసులు శనివారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ దాడిలో నిబంధనలకు విరుద్ధంగా పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 4,320/- నగదును మరియు జూదానికి ఉపయోగించిన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ.. సమాజంలో అశాంతికి కారణమయ్యే జూదం, బెట్టింగ్ వంటి అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. పట్టుబడిన నిందితులపై చట్టప్రకారం కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలు తమ పరిసరాల్లో ఇలాంటి అసాంఘిక పనులు జరుగుతుంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని కోరారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *