తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం :-

మార్కాపురం జిల్లా పరిధిలోని పామూరు పట్టణంలో అక్రమ అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. పామూరులోని అంకమ్మ వీధిలో రహస్యంగా జూదం (పేకాట) నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు శనివారం మెరుపు దాడి నిర్వహించారు. ఈ తనిఖీల్లో జూదమాడుతున్న ఏడుగురు వ్యక్తులను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 45,150/- నగదుతో పాటు జూదానికి ఉపయోగించిన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ.. నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పెద్దపీట వేస్తున్నామని, జూదం, బెట్టింగ్ వంటి అసాంఘిక పనులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *