తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) కందుకూరు నందు ఈనెల 18వ తారీఖున అనగా బుధవారం నాడు నవయువ కవి సమ్మేళనం జరుగుతుందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రవికుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు.విశ్వసాహితీ కళావేదిక, ఆంధ్రప్రదేశ్ మరియు టిఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, తెలుగు విభాగం సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించ బడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ కవి, గాయకులు డాక్టర్ గజల్ శ్రీనివాస్ హాజరవుతున్నారు. అదేవిధంగా విశ్వ సాహితి కళావేదిక వ్యవస్థాపకులు శ్రీమతి కొల్లి రమావతి, కవి, రచయిత, నటులు, గంగా శ్రీ డాక్టర్ రంగిశెట్టి రమేష్ మరియు డాక్టర్ బి.వి.రమణ తదితరులు హాజరవుతున్నట్లు ప్రిన్సిపాల్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థినీ విద్యార్థులు రచించిన కవితలు పఠించడం తో పాటు ప్రముఖుల కవితల గానం మరియు కవి సమ్మేళనం నిర్వహించడం జరుగుతుంది. కావున కందుకూరు పరిసర ప్రాంతాల సాహిత్య అభిలాషులు, పుర ప్రముఖులు ఈ కార్యక్రమానికి 18 వ తారీకు ఉదయం 10 గంటలకు హాజరు కాగలరని ప్రిన్సిపాల్
కోరారు.