తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
పామూరు మండలం వెస్ట్ కట్టకిందపల్లి గ్రామ పరిసరాల్లో అక్రమంగా కోడిపందాలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పామూరు ఎస్‌ఐ తన సిబ్బందితో కలిసి మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో కోడిపందాలు ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 4 పందెం కోళ్లు, రూ. 1,450/- నగదును స్వాధీనం చేసుకున్నారు.ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ.. గ్రామాల్లో జూదం, కోడిపందాలు వంటి అసాంఘిక కార్యకలాపాలను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినమైన కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. పట్టుబడిన నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.