తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

ఆక్సిడెంట్ లో మృతి చెందిన బాధిత పోలీస్ కుటుంబానికి గ్రూప్ పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ (GPAI) చెక్కును సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ అందచేసినారు. ఆర్మీడ్ రిజర్వ్ విభాగంలో విధులు నిర్వర్తిస్తూ ప్రమాదవశాత్తు తేది 01.11.2025 న మృతి చెందిన కీర్తి శేషులు యం.నిరీక్షణ బాబు, ARHC.2057 గారి సతీమణి రత్నకుమారి గారికి రూ. 20,37,000/- చెక్కును అందచేసినారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ అంకిత భావంతో విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు మరణించడం బాధాకరమన్నారు. పోలీస్ శాఖాపరంగా అందాల్సిన ఇతర ప్రయోజనాలు త్వరలోనే అందేలా చూస్తామని, మృతి చెందిన కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఏదైనా సమస్య ఉన్న నేరుగా తనను కలవవచ్చునని వారి కుటుంబ సభ్యులకు ఎస్పీ భరోసా కల్పించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *