తొలి శుభోదయం న్యూస్ వలేటివారిపాలెం:-

,రాష్ట్ర పశు గణాభివృద్ధి సంస్థ రాష్ట్రీయ గోకుల్ మిషన్ ఆర్థిక సహకారం తో లేగ దూడల ప్రదర్శన కార్యక్రమం వలేటివారిపాలెంలో మంగళవారం జరిగిoది. ఈకార్యక్రమమును ప్రాథమిక సహకార సంఘ అధ్యక్షులు గుత్తా మహేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్బంగా జరిగిన సద్దస్సులో ముఖ్య అతిధిగా పాల్గొన పశు సంవర్ధక శాఖ కందుకూరు డివిజన్ ఉప సంచాలకులు డా జి. శ్రీధరరావు మాట్లాడుతూ సకాలములో దూడలకు, గేదలకు నులి పురుగుల మందులు, టీకాలను ముందస్తుగా వేసి పశు సంపదను కాపాడుకోవాలని తద్వారా పశు పోశకుల ఆదాయం పెరుగుతుందనీ తెలియజేసారు . కందుకూరు సహయ సంచాలకులు డా జె చంద్ర మోహన్ మాట్లాడుతూ హరిత గోపాలం పథకం ద్వారా బహు వార్షిక పశు గ్రాసాలు ఉపాధి హామీ పధకం ద్వారా సాగుచేసుకోవచ్చు అని తెలియజేసారు.వలేటివారిపాలెం సహయ సంచాలకులు డా ఇ. చెన్నకేశవులు మాట్లాడుతూ లేగ దూడల సంరక్షణ దూడలకు జున్ను పాలు ప్రాముఖ్యత గురించి ఒక పాడి పశువులు ఇంటి లో ఉంటే ఒక ఎకరా తో సమానముగా ఆదాయం వస్తుందని తెలియజేసారు .మండల పశు వైద్యులు డా యస్ సుధాకర్ మాట్లాడుతూ పాలలో వెన్న శాతం పెరుగుటకు సూచనలు, సలహాలను తెలియజేసారు. ఈకార్యక్రమంలో చిన్న పవని పశు వైద్యులు డా బి. సుబ్రహ్మణ్యం, కోవూరు పశు వైద్యులు వై. శ్రీకాంత్, మాజీ సొసైటీ ప్రెసిడెంట్ వలేటి నరసింహం, మాజీ ఎంపీటీసీ సలహాదారులు వలేటి నరసింహం, డీలర్, కాకుమాని ఆంజినేయులు, నాయకులు వలేటి మధు ,అనంతరం దూడలు అందాల పోటీలలో గెలుపొందిన లేగ దూడల యజమానులకు బహుమతులతోపాటు మినరల్ బ్రిక్స్, నులి పురుగుల మందులు ,లివర్ టానిక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం లో శ్రీలత లైవ్ స్టాక్ అసిస్టెంట్, పశు సహాయకులు కిరణ్, తిరుణ్, రమేష్,అశోక్,చౌడయ్య వెంకటరావు, మౌనిక, లీల, మనోహర్, ప్రవీణ్ , వినోద్ చౌడయ్య, శరత్ పాల్గొన్నారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *