తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల వ్యాప్తంగా పోలీసులు లాడ్జీలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఈ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా లాడ్జీల్లో బస చేసిన వారి వివరాలను, ఐడి కార్డులను మరియు రిజిస్టర్లను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు.లాడ్జీల యజమానులకు పోలీసులు పలు సూచనలు జారీ చేశారు. కొత్త వ్యక్తులు లేదా అనుమానిత వ్యక్తులు ఎవరైనా లాడ్జీలకు వస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించి అసాంఘిక కార్యకలాపాలకు సహకరించే లాడ్జీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.