తొలి శుభోదయం న్యూస్ జరుగుమల్లి:-

జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి గురువారం జరుగుమల్లి మండలంలో పర్యటించారు. కె.బిట్రగుంట గ్రామంలో వరి సాగు ఈ – పంట నమోదు ప్రక్రియను పరిశీలించారు. ప్రభుత్వం నుంచి లభించే రాయితీ, ఇతర ప్రయోజనాలకు ఈ – పంట ప్రామాణికం కాబట్టి రైతులందరూ తప్పనిసరిగా ఈ – పంటలో తమ పంటల వివరాలను నమోదు చేయించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ – పంట వివరాల నమోదులో పొరపాట్లు లేకుండా అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి ఆమె దిశా నిర్దేశం చేశారు. ఈ పర్యటనలో ఆమె వెంట జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, ఇతర అధికారులు ఉన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *