తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-

ప్రముఖ పుణ్యక్షేత్రం, వలేటివారిపాలెం మండలంలోని మాలకొండపై వెలసిన శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామిని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు శనివారం దర్శించుకున్నారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు పండితులు, అధికారులు ఎమ్మెల్యేకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారి దర్శనం చేయించారు. అనంతరం సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్ ను ఎమ్మెల్యే పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దర్శన ఏర్పాట్లు చక్కగా ఉండేలా చూడాలని సూపరింటెండెంట్ ప్రసాద్ కు ఎమ్మెల్యే సూచించారు. పలువురు భక్తులతో మాట్లాడి వసతుల గురించి వాకబు చేశారు. అన్న ప్రసాదం స్వీకరించడంతో పాటు భక్తుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంట మండల టిడిపి అధ్యక్షులు మాదాల లక్ష్మీ నరసింహం, పార్టీ నాయకులు కాకుమాని హర్ష, శనివారపు మాల్యాద్రి, కామినేని అశోక్, గొర్రెపాటి శ్రీను తదితరులు ఉన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *