తొలి శుభోదయం న్యూస్ దర్శి:-
రైతులు తమ పంటను సరైన మద్దతు ధరకు విక్రయించుకునేలా, మధ్యవర్తుల ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా కొనుగోలు ప్రక్రియ సాగేందుకు ఈ కేంద్రం ఉపయుక్తంగా నిలవనుందని ఆమె పేర్కొన్నారు.రైతుల కష్టానికి తగిన గౌరవం దక్కేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో ఇది మరో ముఖ్యమైన అడుగుగా ఆమె అభివర్ణించారు. స్థానిక రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు , మార్క్ఫెడ్ DM హరికృష్ణ, మార్కెట్ యార్డ్ కార్యదర్శి పద్మాశేఖర్, సూపరింటెండెంట్ మస్తాన్ రావు, సొసైటీ అధ్యక్షులు, ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి–సుబ్బారావు, మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్యతో పాటు దర్శి, ముండ్లమూరు, తాళ్లూరు మండలాల టీడీపీ అధ్యక్షులు, పట్టణ నాయకులు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.