తొలి శుభోదయం ప్రకాశం & మార్కాపురం, పోలీసులు:-

మహిళలు, బాలికల భద్రతను మరింత పటిష్టం చేయడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీస్ శాఖ మరియు మార్కాపురం జిల్లా పోలీస్ శాఖ సంయుక్తంగా శక్తి యాప్ డౌన్‌లోడ్‌పై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా పోలీస్ అధికారులు ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు శక్తి యాప్ ప్రాముఖ్యతను వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో ఒక్క క్లిక్‌తో పోలీస్ సహాయం పొందే విధానం, లొకేషన్ ట్రాకింగ్, SOS అలర్ట్ వంటి ఫీచర్లను సులభంగా అర్థమయ్యే విధంగా వివరించి, ప్రత్యక్షంగా మొబైల్ ఫోన్లలో శక్తి యాప్‌ను డౌన్‌లోడ్ చేసి నమోదు చేసుకునేలా అవగాహన కల్పించారు.పోలీస్ అధికారులు మాట్లాడుతూ, మహిళలు ఎలాంటి అపాయం ఎదురైనా భయపడకుండా శక్తి యాప్‌ను వినియోగించి వెంటనే పోలీస్ సహాయం పొందాలని సూచించారు. ఈ యాప్ ద్వారా మహిళల భద్రత మరింత బలపడుతుందని, సమాజంలో నేరాల నివారణకు ఇది ఒక శక్తివంతమైన సాధనమని తెలిపారు.ప్రజలు పోలీస్ శాఖ చేపడుతున్న ఈ తరహా అవగాహన కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని, తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు, పరిచయస్తులకు కూడా శక్తి యాప్ గురించి తెలియజేయాలని కోరారు. మహిళల భద్రతకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇచ్చారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *