తొలి శుభోదయం న్యూస్ వెలుగొండ:-

నేడు జరగబోయే గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు వెలుగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ పనులకు శంకుస్థాపనకు విచ్చేయనున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను వేగవంతం చేసింది.వెలిగొండ ప్రాజెక్ట్ వద్ద హెలిప్యాడ్, భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, వంటి ప్రతి అంశాన్ని జిల్లా అధికారులు సమగ్రంగా సమీక్షిస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మొత్తం అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తూ ఎటువంటి లోపాలు లేకుండా పర్యటన విజయవంతం చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.ఈ క్రమంలో యర్రగొండపాలెం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జి గూడూరి ఎరిక్షన్ బాబు ప్రతి ఏర్పాటును స్వయంగా పరిశీలిస్తూ, అధికారులు మరియు పార్టీ నాయకులతో సమన్వయం చేస్తూ ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం అయ్యేలా కృషి చేస్తున్నారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *