తొలి శుభోదయం న్యూస్ బుచ్చిరెడ్డిపాలెం:-
పవిత్ర రంజాన్ మాసం వేళ ఉపవాస దీక్షలు చేపట్టే ముస్లిం సోదరుల సౌకర్యార్థం వాటర్ కూలర్ల వితరణతో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దాతృత్వాన్ని చాటుకున్నారు. బుచ్చిరెడ్డి పాళెం మండలంలోని దామరమడుగు, పెనుబల్లి వవ్వేరు, చెల్లాయపాలెం, పంచేడు గ్రామాలలోని 5 మసీదులకు ప్రార్థనల నిమిత్తం వచ్చే వారి దాహార్తిని తీర్చేందుకై నెల్లూరు నగరంలోని విపిఆర్ నివాసంలో ఆమె వాటర్ కూలర్లను పంపిణీ చేశారు.
ఎండలు మండిపోతున్న తరుణంలో మసీదులకు వచ్చే భక్తులకు చల్లని తాగునీరు అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో కుమారుడు అర్జున్ రెడ్డి కుమార్తె నీలిమారెడ్డిలో కలిసి ఆమె మసీదు కమిటీ పెద్దలకు వాటర్ కూలర్లను అందచేశారు.కుల మతాలకు అతీతంగా ప్రజల అవసరాలే తన ప్రాధాన్యత అని రంజాన్ నెలలో ఉపవాసం ఉండే ముస్లిం సోదరులు ప్రార్థనల సమయంలో చల్లని తాగునీరు అందించాలన్న ఉద్దేశంతో కూలర్లు మసీదులకు అందజేసినట్లు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బుచ్చిరెడ్డి పాళెం మండలానికి ముస్లిం పెద్దలు మరియు తెలుగుదేశం పార్టీ మైనారిటీ నాయకులు పాల్గొన్నారు.