తొలి శుభోదయం న్యూస్ మర్రిపూడి:-

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ అనుమతితో అంటరానితనం అస్పృశ్యత పై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగిందని రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ అన్నారు. మండలంలోని కూచిపూడి ఎస్సీ కాలనీలో శనివారం సాయంత్రం అవగాహన నిర్వహించామన్నారు, అంటరానితనం అస్పృశ్యతపై ఎలాంటి ఇబ్బందులు ఎదురై ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని రాజశేఖర్ కోరారు,ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ దళితివాడల్లో మౌలిక వసతులు కల్పించాలని విన్నవించుకున్నారు, ప్రధానంగా తాగునీటి సమస్య ఉందన్న విషయాన్ని అధికారులు దృష్టికి పలువురు పెద్దలు తెలిపారు, తాగునీరు విషయమై సమంత అధికారులతో మాట్లాడి సమగ్రమైన సమాచారం తీసుకొని పరిష్కరించేందుకు కృషి చేస్తామని రాజశేఖర్ హామీ ఇచ్చారు, ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ అధికారులు రాణా ప్రతాపరెడ్డి రవణమ్మ ఆదిలక్ష్మి మరియు కాలనీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *