తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
మార్కాపురం జిల్లా కంభం మండలంలో సోమవారం నుండి ప్రారంభమయిన 10వ తరగతి విద్యార్థుల గ్రాండ్ టెస్ట్, 9వ తరగతి విద్యార్థుల సమ్మెటివ్ పరీక్షలను ఎంఈవో-2 శ్రీనివాసులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బాలికోన్నత పాఠశాలల్లో పరీక్షల నిర్వహణను పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు.ఆరోగ్య సలహాలు,రాత నైపుణ్యాలు,అత్యధిక మార్కులు పొందేందుకు అవసరమైన సూచనలు చేశారు.విద్యార్థుల హాజరు,అభ్యసన స్థాయిలపై వాకబు చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వీరనారాయణ ,బి. అమూల్య, సిఆర్పిలు శైలజ, మురళి మోహన్, ఉపాధ్యాయులు ఉన్నారు.