తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలో అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనలో భాగంగా ఒంగోలు పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఒంగోలు తాలుకా పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్త డొంక ప్రాంతంలో బహిరంగంగా జూదం (పేకాట) ఆడుతున్నట్లు అందిన నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు.ఈ దాడిలో జూదానికి పాల్పడుతున్న 8 మంది వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి జూదానికి ఉపయోగిస్తున్న ₹5,450/- నగదును మరియు పేకాట ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న నిందితులపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ.. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మీ పరిసరాల్లో ఎక్కడైనా ఇలాంటి అక్రమ కార్యకలాపాలు జరుగుతుంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించి జిల్లా శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని కోరారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *