తొలి శుభోదయం న్యూస్ :-
ఆంధ్రప్రదేశ్ నాయీబ్రాహ్మణ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు తాటికొండ నరసింహారావు నాయీబ్రాహ్మణ బార్బర్ షాప్ వాళ్లకి జీ వో 69 ఉదహరించి బార్బర్ షాప్ ఉన్న ప్రతి నాయీ బ్రాహ్మణుడికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు అమలు చేయాలని నాయీ బ్రాహ్మణులకు రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని, అసెంబ్లీలో కమ్యూనిటీ సమస్యలను లేవనెత్తటానికి ఒక ప్రజా ప్రతినిధి కూడా లేరని ఎమ్మెల్సి ఇవ్వాలని
ఈనాం భూములకు పట్టాదారు పుస్తకాలు ఇవ్వాలని ఇది కాదు నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా ఆధునిక సెలూన్స్ కు సబ్సిడీ రుణాల అందించి పేటెంట్ హక్కు కల్పించాలని
గురువారం నాడు సెక్రటేరియట్లో బీసీ సంక్షేమ శాఖ మాచులు ఎస్ సబితా వారిని విద్యుత్ శాఖ మాత్యులు గొట్టిపాటి రవికుమార్ వారిని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు వారిని స్వయంగా కలిసి మొత్తంగా ఉన్న సమస్యల మీద దృష్టి సారించి పరిష్కారం చేయాలని చెప్పి వినతి పత్రాలు ఇచ్చి న్యాయం చేయాలని కోరడమైనది.
పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు బీసీ సంక్షేమ శాఖ మాత్యులు ఎస్ సబితా విద్యుత్ శాఖ మాత్యులు గొట్టిపాటి రవికుమార్ నాయి బ్రాహ్మణ సమస్యలు తప్పకుండా పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు.
మంత్రులను కలిసినటువంటి వారిలో నాయీబ్రాహ్మణ జేఏసీరాష్ట్ర అధ్యక్షులు తాటికొండ నరసింహారావు గుంటూరు అర్బన్ ఉపాధ్యక్షులు ఎం వి సుబ్బారావు సౌందర్య శాలల సంక్షేమ విభాగం ఆర్గనైజర్ కే బతేశ్వరరావు వణుకూరుచిన్న వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు