తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-

రాయవరం వద్ద జరిగిన భయానక రోడ్డు ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదకరమని . మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి తెలిపారు.
రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ,తో, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాం ప్రసాద్ రెడ్డి ,తో , ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసుల రెడ్డి ,తో,కనిగిరి శాసన సభ్యులు ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి గార్లతో మరియు ఎర్రగొండపాలెం టిడిపి ఇన్చార్జ్ గూడూరి ఏరిక్షన్ బాబు ,తో కలిసి ఘటనపై స్పందించిన ఆయన టిప్పర్ – ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఈ ప్రమాదం ఎంతో బాధాకరమని, ఈ ఘటన బాధిత కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపిందని పేర్కొంటూ, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం మార్కాపురం జిల్లా ఆసుపత్రికి వెళ్లిన మంత్రులు గాయపడిన వారిని పరామర్శించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 13 మంది కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన హామీ ఇచ్చారు.ప్రమాదానికి గల కారణాలను జిల్లా అధికారులను అడిగి తెలుసుకున్నారు…..

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *