తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-

ప్రకాశం జిల్లా కందుకూరు డివిజన్ జీవన జ్యోతి దివ్యాంగ వికాస సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక జెడిబియం టౌన్ బాప్టిస్ట్ చర్చి వద్ద ఉన్న యాచకులకు మరియు పుచ్చలపల్లి సుందరయ్య నగర్ లో పూరి గుడిసెలలో నివసిస్తున్న పేదలకు దాతల సహకారంతో ఆదివారం భోజనం ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సేవా సమితి కార్యదర్శి శీలం వెంకటేష్ మాట్లాడుతూ యాచకులను, పేదలను కరుణతో చూడాలని ప్రతి ఒక్కరూ సాధ్యమైనంతవరకు వారికి ఆహారం లేదా అవసరమైన సహాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్షుడు చనమాల శ్రీనివాసరావు, ప్రేమ్ బాబు, వేణుబాబు, శివ, విశ్వ, నితీష్, చరణ్ తేజ పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *