తొలి శుభోదయం న్యూస్ దర్శి:-

దర్శి టిడిపి కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జూమ్ మీటింగ్ ద్వారా పార్టీ ప్రధాన కార్యాలయంతో అనుసంధానమై, భారీ ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా కార్యకర్తలు వేడుకలను వీక్షించారు.ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ , టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ కలిసి, ఎన్నో సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు గారిని, నియోజకవర్గంలోని సీనియర్ నాయకులను ఘనంగా సన్మానించారు. అలాగే “బాబు స్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ” కార్యక్రమం, మై టిడిపి యాప్, సభ్యత్వ నమోదు కార్యక్రమాలలో చురుకుగా పనిచేసిన నాయకులను ప్రత్యేకంగా అభినందించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *