తొలి శుభోదయం న్యూస్ దర్శి:-
దర్శి టౌన్‌లోని గడియార స్థంభం వద్ద తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ జెండాను దర్శి టిడిపి ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు, టిడిపి యువ నాయకులు కడియాల లలిత్ సాగర్ గారు, మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు గారు ఆవిష్కరించారు. అనంతరం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మరియు నారపుశెట్టి శ్రీరాములు గారి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో నారపుశెట్టి పిచ్చయ్య (మున్సిపల్ చైర్మన్),
దారం నాగవేణి – సుబ్బారావు (ఏఎంసీ చైర్మన్),
మారెళ్ళ వెంకటేశ్వర్లు (మండల అధ్యక్షుడు),
పుల్లలచెరువు సత్యనారాయణ (టౌన్ అధ్యక్షుడు) తదితరులు
నియోజకవర్గంలోని వివిధ హోదాల్లో ఉన్న టిడిపి నాయకులు, క్లస్టర్ యూనిట్ & బూత్ ఇంచార్జ్‌లు, వార్డ్ అధ్యక్షులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.