తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-

ఒంగోలు (ప్రకాశం భవనం)
గౌరవనీయులైన జిల్లా రెవెన్యూ అధికారి (DRO) శ్రీ ఓబులేశు మరియు సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ ఎన్. లక్ష్మా నాయక్ గారి అధ్యక్షతన జరిగిన డా. బాబు జగజీవన్ రామ్ (118వ) మరియు డా. బి.ఆర్. అంబేద్కర్ (135వ) జయంతి ఉత్సవాల ముందస్తు సమీక్షా సమావేశంలో MRPS ప్రకాశం జిల్లా అధ్యక్షులు రావినూతల కోటి మాదిగ పాల్గొని, అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.జిల్లాలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో, అన్ని శాఖల అధికారులు ఈ వేడుకలకు తప్పనిసరిగా హాజరై మహనీయులకు నివాళులర్పించాలి.జిల్లాలోని అన్ని మండలాల్లో ఉన్న దళిత సంఘాల నాయకులను, సామాజిక కార్యకర్తలను గౌరవప్రదంగా ఆహ్వానించి, ఈ వేడుకలను ఒక ప్రజోద్యమంలా నిర్వహించాలి.జయంతి వేడుకల సందర్భంగా దళిత వాడల్లోని మౌలిక సదుపాయాల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి ఈ సమావేశాన్ని వేదికగా మలచాలి.ఒంగోలు ప్రధాన కూడళ్లలో విగ్రహాలను సుందరీకరించి, ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలకు మంచినీరు, మజ్జిగ ఏర్పాటు చేయాలి.మహనీయులు కలలుగన్న సామాజిక న్యాయం మన జిల్లా యంత్రాంగం పనితీరులో కనిపించాలి. ప్రకాశం జిల్లాలో ఈ ఉత్సవాలు రాష్ట్రానికే ఆదర్శంగా నిలవాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో దళిత హక్కుల సాధన సమితి వ్యవస్థాపకులు ముప్పవరపు గోపి, కొండపి నియోజకవర్గ ఇంచార్జ్ రేణుమాల మాధవ్ మాదిగ, కందుకూరు నియోజక వర్గ ఇంచార్జి గౌడపేరు కృష్ణ మాదిగ, సింగరాయకొండ మండల అధ్యక్షులు రావినూతల వెంకటేష్ మాదిగ, మండల కన్వీనర్స్ పొనుగోటి ఉదయ్ కుమార్ మాదిగ, సురపోగు మోజేష్ మాదిగ, పొనుగోటి ప్రకాష్ మాదిగ, పెద్దపూడి అహరోను మాదిగ పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *