మారుమోగిన జై అమరావతి నినాదం
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
రాష్ట్ర రాజధాని అమరావతికి పార్లమెంటులో చట్టబద్ధత కల్పించడంపట్ల హర్షం వ్యక్తం చేస్తూ… కందుకూరు పట్టణంలో గురువారం సాయంత్రం పెద్ద ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారి సూచనలతో…. కూటమి పార్టీల ఆధ్వర్యంలో ఉత్సవ ర్యాలీ జరిగింది. ఎన్టీఆర్ సర్కిల్ నుంచి పోస్ట్ ఆఫీస్ సెంటర్ మీదుగా అంబేద్కర్ విగ్రహం వరకు కార్యక్రమం కొనసాగగా… మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొన్నారు. మోదీ, చంద్రబాబు న్యాయకత్వం వర్ధిల్లాలి, జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. ముందుగా స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ శాసనసభ్యులు దివి శివరాం సహా పలువురు నేతలు పూలమాలవేసి ర్యాలీ ప్రారంభించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద శివరాం మాట్లాడుతూ రాజధాని కోసం 33 వేలఎకరాలు ఇచ్చిన రైతులను నానా ఇబ్బందులు పెట్టినా, రాజధానిని అడ్డుకోవాలని చూసినా, చివరకు ధర్మమే గెలిచిందన్నారు. ప్రధానమంత్రి మోడీ సహకారంతో పార్లమెంటు ఉభయ సభల్లో రాజధానికి చట్టబద్ధత ఏర్పడిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు పట్టుదలతో, భావితరాల భవిష్యత్తు కోసం అమరావతిని విశ్వ నగరంగా తీర్చిదిద్దుతున్నారని అన్నారు. ప్రజలంతా ఆయనకు మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. పట్టణ టిడిపి అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు మాట్లాడుతూ పార్లమెంట్ తీర్మానం పట్ల ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తుంటే… జగన్ మాత్రం ఇంకా సిగ్గు లేకుండా ఏవేవో మాట్లాడుతున్నారని విమర్శించారు. అమరావతి పూర్తయితే తనకు రాజకీయ భవిష్యత్తు ఉండదని జగన్ భయపడుతున్నారని అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రానికి ఇక తిరుగు లేదన్నారు. మరోసారి జగన్ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదన్నారు. నియోజకవర్గ బిజెపి కన్వీనర్ ఘట్టమనేని హరిబాబు మాట్లాడుతూ అమరావతికి భూములు ఇచ్చిన రైతులతోపాటు, రాష్ట్ర ప్రజల ఆకాంక్ష నెరవేరిందన్నారు. కేంద్రం సహకారంతో రాజధాని అత్యద్భుతంగా తయారవుతోందని ప్రశంసించారు. కార్యక్రమంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాణాసంచా కాలుస్తూ.. స్వీట్లు పంచుకొని సంతోషం వ్యక్తం చేశారు. ఈ ర్యాలీలో రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చిలకపాటి మధు, పట్టణ మాజీ అధ్యక్షుడు పిడికిటి వెంకటేశ్వర్లు, నార్నే రోశయ్య, ఉప్పుటూరి శ్రీను, రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి బెజవాడ ప్రసాద్, రాష్ట్ర ముస్లిం మైనార్టీ సెల్ అధికార ప్రతినిధి షేక్ రఫీ, నెల్లూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి చదలవాడ కొండయ్య, కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ రూబీ, గోచిపాతల మోషే, నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు కల్లూరి శైలజ, తెలుగురైతు అధ్యక్షుడు అల్లం వెంకటేశ్వర్లు, ఐటిడిపి అధ్యక్షుడు షేక్ మున్నా, బీసీ సెల్ అధ్యక్షుడు ముచ్చు శ్రీను, వడ్డేళ్ళ రవిచంద్ర, షేక్ సలాం, పట్టణ తెలుగు మహిళ అధ్యక్షురాలు ముచ్చు లక్ష్మీరాజ్యం, మహిళా నేతలు తల్లపనేని పార్వతి, శ్రీలక్ష్మి అత్తంటి శ్రీలక్ష్మి, దాక్షాయణి, మీనా, సృజన, నారాయణమ్మ, సోమమ్మ, అన్ని వార్డుల అధ్యక్షులు, అనుబంధ సంఘాల కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.