తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ కొల్లి శ్రీనివాసరావు ఆదేశానుసారం ఒంగోలు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ రాఘవరావుకి రాబడిన సమాచారం మేరకు ఎస్ ఐ నాగేశ్వరావు మరియు ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ విజయ్ భాస్కర్ సిబ్బంది కలిసి కందుకూరు పట్టణంలోని కుసుమ ఎలక్ట్రానిక్స్ ఓనర్ కొల్లూరు శ్రీనివాసరావు అను వ్యక్తి అక్రమంగా కమర్షియల్ 34 సిలిండర్స్ నిల్వవుంచి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఎటువంటి అనుమతులు, లైసెన్స్ లేకుండా సిలిండర్ లను నిల్వవుంచి అధిక ధరలకు అమ్ముతున్నట్టు తెలిపారు.వాటిని సీజ్ చేసి సుచిత భారత్ గ్యాస్ ఏజెన్సీ కందుకూరు వారికి తరలించారని. శ్రీనివాసరావు పైన 6(ఏ )కేసు ను ఒంగోలు జాయింట్ కలెక్టర్ కోర్ట్ లో కేసు నమోదు చేసినట్లు వారు తెలియజేశారు.