తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
రాచర్ల మండలంలోని నెమలిగుండ్లలో జరుగుతున్న ప్రముఖ రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల రెండో రోజు జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత పాల్గొని స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది కలెక్టర్కు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె ఆలయ పరిసరాలను పరిశీలించి, ఉత్సవాల ప్రత్యేకత, ఆలయ చరిత్రపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
శనివారం జరగనున్న తెప్పోత్సవానికి సంబంధించి ఏర్పాట్లను కూడా కలెక్టర్ పరిశీలించారు. గుండంలో నిర్వహించే ఈ తెప్పోత్సవాన్ని కట్టుదిట్టమైన భద్రత మధ్య నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, మార్కాపురం ఆర్డీవో ప్రభాకర్, ఆలయ ఈవో నాగయ్య తదితరులు పాల్గొన్నారు…..