తొలి శుభోదయం న్యూస్ బాపట్ల:-
బాపట్ల పట్టణ 9వ వార్డు గుంటూరు బ్రిడ్జి కింద నూతనంగా ఏర్పాటు చేసిన “బాపట్ల బాలవనం” (చిన్నారుల పార్కు)ను రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, బాపట్ల జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు శ్రీ కొలుసు పార్థసారథి గారు,జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీ వి. వినోద్ కుమార్ గార్లతో కలిసి బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారు, ఘనంగా ప్రారంభించి పార్కులోని వసతులను పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు మాట్లాడుతూ:”పట్టణ ప్రజలకు, ముఖ్యంగా చిన్నారులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో, వాడుకలో లేని బ్రిడ్జి కింద ఖాళీ స్థలాన్ని సుందరీకరించి ఈ ‘బాలవనం’గా తీర్చిదిద్దడం జరిగింది. కూటమి ప్రభుత్వం ప్రజా సౌకర్యాల కల్పనలో ఎప్పుడూ ముందుంటుంది. రాబోయే రోజుల్లో బాపట్ల పట్టణాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతాం,” అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బాపట్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ తెన్నేటి కృష్ణ ప్రసాద్, మరియు బావుడా చైర్మన్ శ్రీ సలగల రాజశేఖర్ బాబు ఆర్.డి.ఓ గ్లోరియా, మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, తాసిల్దార్ సలీమా గారు, బాపట్ల పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గొలపల శ్రీనివాసరావు , కూటమి పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు వివిధ శాఖల అధికారులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.