తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
ఐ.ఎఫ్.సి ఫౌండేషన్ కందుకూరు వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ వస్తున్న “మహిళలకు చేయుత” అనే కార్యక్రమంలో భాగంగా మహిళలు ఆర్ధికంగా ఎదగాలని కందుకూరు వివిధ ప్రాంతాల్లో వివరాలు సేకరించి భర్త లేని వితంతువులు,పేద ముస్లిం మహిళలకు దాతల సహాయంతో 10 మంది మహిళల జీవనోపాధి కొరకు తోపుడు బండ్లు , కుట్టుమిషన్ లు,రోల్డ్ గోల్డ్,టైలరింగ్, చీరల,టిఫిన్ సెంటర్ ల కొరకు సామాగ్రి ఫౌండేషన్ సెక్రటరి షంషేర్ చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో కొన్ని కారణాలతో కష్టాల్లో ఉన్న కొందరు మహిళలు ఆర్థికంగా ఎదగాలని, స్వయం శక్తితో ముందుకు సాగాలని, మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని,భవిష్యత్తులో వారికి ఖర్చులకు తగ్గట్టుగా వారు స్వతహాగ సంపాదించుకునేందుకు వీలుగా సోమవారం ఈ మహిళలకు చేయుత అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది అంటూ సహాయ సహకారాలు అందించిన దాతలకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో
ఫౌండేషన్ ప్రెసిడెంట్ సాజిద్, ట్రజరర్ హాఫీజ్, ఇంచార్జ్ అయూబ్ ఖాన్ పఠాన్, అన్సర్, షమ్ షూద్దీన్ పాల్గొన్నారు.