తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-

ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలో నిర్వహిస్తున్న జనాభా లెక్కల ఎనీమరేటర్ల శిక్షణ కార్యక్రమంలో మొదటి బ్యాచ్ శిక్షణ విజయవంతంగా ముగిసింది. ఈ శిక్షణ తరగతులను మండల అభివృద్ధి అధికారి జయమణి పరిశీలించారు.
ఈ సందర్భంగా అన్యుమరేటర్లతో మాట్లాడిన జయమణి, శిక్షణలో అన్ని మెలకువలు పాటించాలని సూచించారు. ఫీల్డ్ స్థాయిలో గ్రామస్థులతో సాన్నిహిత్యంగా మాట్లాడి ఖచ్చితమైన గణాంకాలను నమోదు చేయాలని, ఎక్కువమంది ప్రజలు స్వీయ గణన చేసుకునేలా అవగాహన కల్పించాలని తెలిపారు.
తహసీల్దార్ రాజేష్ మాట్లాడుతూ, మొబైల్ యాప్‌లో డేటా నమోదు సమయంలో సరైన సమాచారాన్ని జాగ్రత్తగా నమోదు చేయాలని సూచించారు. శిక్షకులకు డెమో తరగతులు నిర్వహించి, ఫీల్డ్ లెవల్‌లో సమాచార సేకరణ విధానాలను వివరించారు. అదనంగా, విద్యానగర్ ప్రాంతంలోని కొన్ని గృహాలను సందర్శించి శిక్షణ ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ ప్రసాద్, ఏఎస్‌ఓ శ్రీనివాసులు, ఫీల్డ్ ట్రైనర్లు అర్రిబోయిన రాంబాబు, అంబటి బ్రహ్మయ్య మరియు శిక్షణకు హాజరైన ఎన్యుమరేటర్లు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *