తొలి శుభోదయం న్యూస్ బాపట్ల:-
బాపట్ల వ్యవసాయ కళాశాలలో సామాజిక సంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే 99వ జయంతి సందర్భంగా ఘనంగా సభ నిర్వహించారు.ఈ సందర్భంగా కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ రవీంద్రనాథ్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, జ్యోతిరావు పూలే సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి చేసిన సేవలను స్మరించుకున్నారు. విద్య, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి యువతకు ప్రేరణగా నిలుస్తుందని తెలిపారు. ప్రతి విద్యార్థి పూలే ఆలోచనలు, సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకుని సమాజ సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు.ఏ.ఈ.ఎల్.పి. జర్నలిజం విద్యార్థులు పూలే దంపతుల యొక్క జీవిత చరిత్ర మరియు వారు స్థాపించిన ” సత్యశోధక్” ” సమాజ్” గురించి చదివి వినిపించారు. తొలుత పూలే చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డా. చంద్రశేఖర్, డా.విజయ్ కుమార్, డా. అబ్దుల్ సలాం, డా. అక్షయ్, డా. నెహ్రూ నాయక్, బోధన బోధనేతర సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.