తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-

వలేటివారిపాలెం మండలం మాలకొండ పుణ్యక్షేత్రంలో శనివారం నిర్వహించిన పలు ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది. దేవాదాయ, ధర్మాదాయ శాఖ మరియు హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ధార్మిక సదస్సులో ట్రస్ట్ చైర్మన్ శ్రీ దాసరి శ్రీనివాసులు గారితో పాటు పాల్గొని, ధర్మ పరిరక్షణపై చర్చించాము.హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధి, జీర్ణోద్ధరణ, అర్చకుల సంక్షేమం, ధార్మిక కార్యక్రమాల నిర్వహణకు కట్టుబడి ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నాను.ఈ సందర్భంగా భక్తులకు భగవద్గీత గ్రంథాలను పంపిణీ చేయడం జరిగింది. అనంతరం స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నాను. అన్నదాన సత్రంలో భక్తులతో మమేకమై, వారికి అందుతున్న సేవలపై ఆరా తీశాను.మాలకొండలో దాతల సహకారంతో నిర్మించిన పోలీస్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించాను. అలాగే కొండకింద లడ్డూ ప్రసాదం ట్రేలు ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించడం జరిగింది. దేవస్థాన అభివృద్ధికి దాతలు అందిస్తున్న సహకారం అభినందనీయం.దేవస్థానం పరిధిలో అనధికారికంగా నడుస్తున్న దుకాణాలు, అధిక ధరలు వసూలు చేస్తున్న విషయాలను గమనించి అధికారులకు తీవ్రంగా ఆదేశాలు జారీ చేశాను. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని సూచించాను.
భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, మాలకొండ క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేయడం ప్రభుత్వ ముఖ్య లక్ష్యం.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *